రూరల్ ఏడీఏ ఆఫీస్ ఎదుట బాధిత కుటుంబం ఆందోళన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తమ కుటుంబానికి అందాల్సిన బెనిఫిట్స్ అందకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గుండిపోటుతో మరణించిన ధర్పల్లి ఏవో ప్రవీణ్ కుటుంబ సభ్యులు రూరల్ ఏడీఏ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేశారు. ప్రవీణ్ మృతి చెందిన బాధలో తాముంటే తమను ఇంకా వేధిస్తున్నారని మృతుడి భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రవీణ్ చిత్రపటాన్ని తీసుకుని వచ్చి ఏడీఏ కార్యాలయం ఎదుట బైటాయించారు.

Victim's family protests in front of Rural ADA office
Comments (0)
Add Comment