బతుకమ్మ,ఏర్గట్ల : మండల కేంద్రం ఏర్గట్ల లోని శివాజీ విగ్రహం వద్ద తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టపూర్ దయానంద్ నాయక్ మాట్లాడుతూ,చాకలి ఐలమ్మ అనగారిన వర్గాల ప్రజలతో పాటు సబ్బండ వర్గాల ప్రజల కోసం రజకారులు,దేశ్ ముఖ్, భూస్వాముల మీద ఎదురు తిరిగి భూమి కోసం,భుక్తి కోసం,ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి పేద ప్రజల జీవితాలు మార్చడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రజక సంఘం అధ్యక్షుడు మునిమాణిక్యం అశోక్, సంఘ సభ్యులు మహేష్ సాయి కిషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ జిల్లా డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి, జైనోద్దీన్, గన్నారపు రాజేశ్వర్,బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ నాయకులు దిబ్బ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కు మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నర్సయ్య, కుమ్మరి సహదేవ్,వడ్నాల గంగాధర్, సురేష్ యాదవ్ ,తదితరులు, పాల్గొన్నారు.