గన్నారం గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ విధించిన వీడీసీ

 

.. మాదిగలపై దాడిని నిరసిస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

ఇందల్వాయి,బతుకమ్మ :

 

గన్నారం వీడీసీ కుల బహిష్కరణ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని మాదిగ కులస్తులు అవేదన వ్యక్తం చేశారు. మాదిగల పై దాడిని నిరసిస్తూ శుక్రవారం ఇందల్వాయి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా మాదిగలకు పట్టా కేటాయించిన భూమిని చదును చేసుకొని అందులో బోరు మోటర్  వేయడం జరిగిందన్నారు. వీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీ వారు అట్టి భూమిని గ్రామానికి ఇవ్వాల్సిందిగా ఎస్సీ మాదిగలను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.మా భూమి మాకు కావాలి నాకు అందులో పట్టా ఉన్నదని తెలిపారు.వీడిసి పెత్తనాన్ని రద్దు చేయాలని ఎమ్మార్వో కార్యాలయానికి గన్నారం గ్రామం నుండి కాలినడకన తహసీల్దార్ కార్యాలయం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చి తాహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో తాహసిల్దార్ లేకపోవడంతో తహసిల్దార్ కార్యాలయం ముందు గన్నారం గ్రామానికి చెందిన మాదిగ కులస్తులు భారీ ఎత్తున ధర్నా ను నిర్వహించారు. విడిసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తాహసిల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.గ్రామంలో మాదిగల పట్ల అగ్రవర్ణ కులాల వారు పెత్తనం చెలాయిస్తూ తమను అణగదొక్కుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాదిగల సమస్యల పట్ల స్పందించడం లేదని వాపోయారు గ్రామంలో మాదిగలకు చెందిన ట్రాక్టర్లను అగ్రవర్ణాల, బీసీ ల వ్యవసాయ పొలాల్లో మాదిగల కు చెందిన ట్రాక్టర్ లను నడపవద్దని హుకుం జారీ చేశారన్నారు. ఒకవేళ నడిపినట్లయితే 50 వేల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో స్థానిక ఎస్సై  సమాలత సైతం రాజరాజేశ్వర మందిరం లో బీసీ కమిటీ సభ్యులకు మాదిగ  కులస్తుల తో సమావేశం నిర్వహించి ఇరువురితో మాట్లాడి ఎవరి పొలంలోనైనా దున్నుకోవచ్చు,ఎవరు పనికి పిలిచినా పోవచ్చు అని ఇరు వర్గాలు ఓప్పించడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ గ్రామస్తులు పనులకు పిలవకుండా ట్రాక్టర్లను నడవకుండా అడ్డుపడుతున్నారని ఆందోళన చెందుతున్నారు ఇలాగైతే తన పొట్ట గడవడం ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే కుటుంబాలు రోడ్డున పడతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు.

తహసీల్దార్ ను కార్యాలయంలోకి వెళ్లే గేట్ వద్ద అడ్డుకున్న మాదిగలు …

…తక్షణమే తమకున్న సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా  నివేదిక పంపాలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర ఆందోళన సైతం జరిగే అవకాశాలున్నట్లు వారు తహసీల్దార్ కి తెలిపారు. స్పందించిన తహసీల్దార్ మీరు ఇచ్చిన లేక ప్రకారం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తాహసిల్దార్ హామీతో ఆందోళనకారులు,ఆందోళనలు ధర్నాను విరమింప చేశారు. అనంతరం గన్నారం గ్రామానికి చెందిన దళిత మాదిగలు తహసీల్దార్ బాలయ్య కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మహేష్ మండే టు అశోక్ కట్ట పురం గంగాదాసు మండేదు సాయిరాం పట్టపురం గంగా నరసయ్య మహిళలు విద్యార్థులు విద్యార్థులు కుల పెద్ద మనుషులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

VDC imposes social boycott on Madigas in Gannaram village
Comments (0)
Add Comment