. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వేసవిలో ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ బుధవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. పాడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి టీకాలు వేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేయాలన్నారు. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం, పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు, పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.