- పీ డీ ఎస్ యూ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పేద,మధ్యతరగతి విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని సోమవారం పీ డీ ఎస్ యూ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీ డీ ఎస్ యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే తమ ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్స్, ఎస్ఎంఎచ్ హాస్టల్ బకాయిలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఎస్ఎంహెచ్ హాస్టల్ లో సొంత వసతి గృహాలు లేకపోవడం దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన వసతి గృహాలు కూలిపోయే పరిస్థితుల్లో ఉండడం , విద్యార్థులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండడం జరుగుతుందన్నారు. వెంటనే సొంత వసతి గృహ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాలుర విద్యార్థులకు ఉచిత బస్ పాసులను అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడం లేదని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యన భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు ఐఐటి, నీట్ కోచింగ్ ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాటు చేయాలన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల,హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కబ్జావుతున్నాయని,వెంటనే ప్రతి పాఠశాల చుట్టూరా ప్రహరీ గోడ నిర్మించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్య సంస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె అషూర్, ఎల్. అనిల్, జిల్లా కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు నసీర్, వైష్ణవి, వినోద్,సృజన్, శ్రావణి, దివ్య, సంతోష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.