. . . పసుపు ఆధారిత పరిశ్రమలలు ఏర్పాటు చేయాలి
. . . మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజమాబాద్, బతుకమ్మ: :
నిజామాబాద్ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయం అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజమాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయినందుకు జిల్లా పసుపు రైతులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటం,ఆనాటి ఎంపీ కవితమ్మ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు,ప్రధాన మంత్రి ని కలవటం, పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం కవితమ్మ పార్లమెంట్ లో గళమెత్తటం లాంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డ్ ఏర్పాటు కల ఫలించిందన్నారు.ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.15,000 ఉండేలా చూడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నాం అని ఎమ్మెల్యే వేముల అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ లో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 42 ఎకరాలలో టర్మరిక్ స్పైస్ పార్క్ ఏర్పాటు చేసి రోడ్లు,కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేశామని గుర్తు చేశారునిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు కాబట్టి పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చూసే బాధ్యత కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది అన్నారు.పసుపు బోర్డ్ నూతన చైర్మన్ గా నియమించబడిన ఈ ప్రాంత వాసి పల్లె గంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.