నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

 

. . . మార్చి 16న జరిగే మహా ధర్నా ను జయప్రదం చేయాలి

 

. . . డి.మల్లికార్జున్ ఐఎఫ్ టీయూ నగర అధ్యక్షులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తున్న లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్ళు కానున్నాయని, ఈ దేశ కార్మిక వర్గానికి మరణ శాసనాలైనా నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయు) నగర కమిటీ అధ్యక్షులు డి.మల్లికార్జున్ అన్నారు. గురువారం ద్వారక నగర్ ఐఎఫ్ టీయూ నగర కమిటీ కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించి మార్చి 16న జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్న గోడపోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల ను బానిసలుగా మార్చే కుట్రకు పూనుకున్నాడని అన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన రూల్స్ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్ లను అమలు చేయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ లో కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెంచే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే భూతద్దం వేసి చూసినా కనబడవని కార్మికుడు కార్మిక సంఘాల నిర్వచనాలనే పూర్తిగా ఈ కోడ్స్ మార్చేశాయని వేతనాల విషయంలో యాజమాన్యాలది పూర్తి బాధ్యత అని, అన్ని రకాల వివాదాంశాలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వాదేనని ఈ కోడ్స్ పేర్కొంటున్నాయని అన్నారు. కార్మిక చట్టాల భౌతిక ఉనికిని అస్తిత్వాన్ని ధ్వంసం చేసే కార్మిక వర్గం మౌలిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై సమరశీల కార్మిక పోరాటాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై మార్చి 16 న ఐఎఫ్ టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ వద్ద మహాధర్నను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టీ యు నగర కమిటీ కార్యదర్శి ఎం.శివకుమార్, సహాయ కార్యదర్శి నీలం సాయిబాబా, ఐఎఫ్టియు నగర కమిటీ సభ్యులు మచ్చ మోహన్, రమేష్, శంకర్, రాజు, వినయ్, నర్సింగ్ రావు, వీరయ్య, దాసు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

The four labor codes should be repealed immediately.
Comments (0)
Add Comment