విజయవాడ, బతుకమ్మ : ఏపీలోని విజయవాడలో గల కొత్తపేటలో దారుణ ఘటన జరిగింది. మద్యం తాగడానికి రూ.10 ఇవ్వలేదని ఓ బాలుడు కత్తితో పొడిచి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అతను తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని తాతాజీ గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలుడు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.