30.9 C
Hyderabad
Monday, August 3, 2026

వైద్యుని మృతదేహం మెడికల్ కాలేజ్ కు దానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ సీనియర్ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్. విద్యాసాగర్ మృత దేహాన్ని మెడికల్ కాలేజ్ దానం చేశారు. అకాలంగా మృతి చెందిన విద్యాసాగర్ మృత దేహాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆఫీసర్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో డొనేట్ చేశారు. తన పార్దివ దేహాన్ని మెడికల్ కాలేజ్ కు డొనేట్ చేసి అయన సమాజంలో ఆదర్శప్రాయుడిగా నిలిచారని పలువురు వైద్యులు పేరుకొన్నారు. ఈ కార్యక్రమం లో ఐ. ఎం. ఏ ప్రెసిడెంట్ డాక్టర్. అజ్జా శ్రీనివాస్, ఐ ఎంఏ స్టేట్ మెయిన్ అడవైజర్ డాక్టర్. ఏలేటి రవీందర్ రెడ్డి, మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. తిరుపతి రావు, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్. శ్రీనివాస్, డాక్టర్లు కౌలయ్య, రాంచందర్, డీ ఎల్ ఎన్ స్వామి, సత్య నారాయణ అనుమల, సుభాష్, బేజురెడ్డి, నందకుమార్, ఆర్. శ్రీనివాస్, చంద్ర శేఖర్ రావు,ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు స్వామీదాస్,నాగనాథ్, క్లబ్ మేనేజర్ సురేష్ లు పాల్గొన్నారు.

The body of the doctor was donated to the medical college

More articles

Latest article