నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రిన్సిపాల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గుత్ప భూమా రెడ్డి కంప్యూటర్ ల్యాబ్ కోసం తొంబయివేల రూపాయలతో కావలసిన ఫర్నిచర్ ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ తాను వసతులు లేని కాలంలో సాధారణ డిగ్రీలో భాగంగా సాంకేతికతను చదువుకొని విదేశాలలో కంప్యూటర్ రంగంలో స్థిరపడటం జరిగిందని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉండే విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాలు అందితే అద్భుతాలు సృష్టిస్థారనే విశ్వాసాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఫిక్, అల్యూమిని కోఆర్డినేటర్ దండు స్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ ఐ. గంగాధర్, ఎన్సిసి అధికారి రామస్వామి, మరియు వివిధ విభాగాల అధిపతులు కిరణ్ కుమార్, రామకృష్ణ, జయప్రసాద్, ముత్తేన్న, రాజేష్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ తదితర అధ్యాపక బృందం, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
