వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటికిటలాడిన బాలాజీ ఆలయం

బోధన్, బతుకమ్మ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ప్రధాన రహదారిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల బాలాజీ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలం నుండే స్వామివారికి సుప్రభాత సేవలు, అభిషేకాలు, గోవింద నామ సోత్రాలతో అర్చనలు, మంగళ నిరాజనాలు నిర్వహించారు. నేడు ఉత్తర ద్వారం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ప్రాప్తం ఉంటుందని, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల సర్వ కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలను తోరణాలతో విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా కమిటీ సభ్యులు అలంకరించారు. భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ గుప్తా, హనుమంతరావు పటేల్, పాపిరెడ్డి, గంగాధరప్ప, రామ్ చందర్ ఈనాని, సుభాష్ సెట్, తేకేలె ప్రభాకర్, రాజు, లక్ష్మణ్ మహాజన్, శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాన్ చారి, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

The Balaji temple is teeming with devotees on the occasion of Vaikuntha Ekadashi
Comments (0)
Add Comment