బెస్ట్ విధ్యార్ధుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నవిజ్ఞాన్ స్కూల్‌లో పై చర్యలు తీసుకోవాలి

 

. . . బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూళ్లు

. . . ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన టీజీవీపీ

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ స్కూల్‌ పై చర్య లు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి పిర్యాదు చేశారు.బెస్ట్ అవైలెబుల్ పథకం లో విజ్ఞాన్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు  ఆరోపణలు ఉన్న అక్రమాలు పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ టౌన్ ప్రెసిడెంట్ సుంకోజి అఖిల్ మాట్లాడుతూ…ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన షూస్, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.అలాగే విద్యార్థులు ఉపయోగించాల్సిన నోట్‌బుక్స్ ను స్కూల్ యాజమాన్యమే అధిక ధరలకు విక్రయిస్తూ, వారికి ఎలాంటి రసీదులు ఇవ్వకుండా విక్రయిస్తున్నారని, వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలిపారు.ఈ అంశాలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వారి తల్లిదండ్రుల పై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హేమంత్ అంకుష్ , రోహన్ తదితరులు పాల్గొన్నారు.

The above measures must be implemented at Vignan School
Comments (0)
Add Comment