నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరీబాయి పేరుపెట్టాలని సీనియర్ దళిత నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు బంగారు సాయిలు డిమాండ్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు తాటి రాజు, నాయకులు కేశ్ పల్లి రవి, నగర అధ్యక్షుడు సక్కి చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి మద్దెల సంతోష్, రత్నాకర్, మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి
టిఎన్ రమేశ్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర చరిత్ర తెలియని కొందరు లెఫ్ట్ పార్టీ ల నాయకులు యూనివర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెడతామంటే వ్యతిరేకించడం వారి అజ్ఞానాన్ని సూచిస్తోందని సాయిలు మండిపడ్డారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇందిరా గాంధీ కుటుంబంలో సభ్యురాలిగా మెదిలి దళిత వర్గాన్ని జాతీయ స్థాయిలో చైతన్యపరిచిన మహాత్మురాలు, తెలంగాణ ఉద్యమకారిణి అయిన ఈశ్వరీబాయి అసెంబ్లీని గడగడలాడించారని, బహుజనుల బాగు కోసం ఆమె నిరంతరం కృషి చేశారన్నారు.