హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుంటే ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా BDG SLOT అనే బెట్టింగ్ సైట్ ఓ పెన్ అవుతోంది. ఈవిషయమై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.