29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవిపేట్ : చాకలి ఐలమ్మ వర్థంతి పురస్కరించుకుని మండలం లోని నాలేశ్వర్ ఐలమ్మ విగ్రహానికి రజక సంఘ నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతు తెలంగాణలో పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని వినిపించి, దొరలను గడీల నుంచి ఉరికించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలని, తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాటం నేటి మహిళకు స్ఫూర్తి అని కొనియాడారు. తెలంగాణ పొరటయోధులకు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ద్యాగ సరిన్,చిన్న భీమరేడ్డి,శ్రీనివాస్,భూషణ్, రజక సంఘ నాయకులు గర్నపల్లి ప్రవిణ్,ఓరగంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article