తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ
బతుకమ్మ, నవిపేట్ : చాకలి ఐలమ్మ వర్థంతి పురస్కరించుకుని మండలం లోని నాలేశ్వర్ ఐలమ్మ విగ్రహానికి రజక సంఘ నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతు తెలంగాణలో పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని వినిపించి, దొరలను గడీల నుంచి ఉరికించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలని, తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాటం...