నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలకు వేసవి సెలవుల అనంతరం ఈనెల 12 నుండి పున ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సూచిక 1 ప్రకారం డైరెక్టర్ కార్యాలయం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను జిల్లా విద్యాశాఖ చేపట్టాలని అన్నారు. కానీ గతంలో ఇటువంటి ప్రక్రియ చేపట్టినప్పుడు అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. సర్దుబాటు ఆయా మండల పరిధిలో నే నిర్వహించాలన్నారు. వీలుకానప్పుడు మాత్రమే నియరెస్ట్ మండలం అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఇలా కాకుండా ఇష్టారాజ్యంగా కొంతమందిని సదరు మండలంలో కాళీ ఉన్నప్పటికీ మండలాలను, డివిజన్లు మార్చి సర్దుబాటు చేయడంతో పాటు సర్ ప్లస్ కాకపోయినా ఆయా పాఠశాలల నుండి తొలగించి అవసరం లేని పాఠశాలలకు సర్దుబాటు ద్వారా కేటాయించడం లాంటి అక్రమాలకు గత డీఈవో తెరలేపారని అన్నారు. సర్దుబాట అక్రమాలపై డిటిఎఫ్ గా అభ్యంతర వ్యక్తం చేస్తూ అక్రమ సర్దుబాటులపై ఉన్నతాధికారులకు ఆనాడు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రస్తుతం చేపట్టబోతున్న సర్దుబాటు ప్రక్రియ నిబంధనలకు లోబడి మాత్రమే చేపట్టాలని ఎటువంటి అక్రమాలకు ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.