నిజామాబాద్ సీటి, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ జరిగింది. నగరంలోని వినాయక్ నగర్ లోని బసవకార్డెన్ లో టైక్వాండ క్రీడాకారులు 80 మంది తమ ప్రతిభను ప్రదర్శించి బెల్టులు సాధించారు. ఈ అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో 80 మంది క్రీడాకారులు తన ప్రతిభను చూపి బెల్ట్ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒలంపిక్ చైర్మన్ లింగన్న నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోనే ఒలంపిక్ నుండి గుర్తింపు పొందిన అసోసియేషన్ క్రీడాకారులకు సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ లో స్పోర్ట్స్ కోటా కిందకి వినియోగించుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజు పిల్లలకు చదువుతోపాటు టైక్వాండలాంటి క్రీడా చాలా ఉపయోగమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టైక్వాండ అసోసియేషన్ కోశాధికారి వెంకటరమణ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
