27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

15వ వార్డులో స్వచ్ఛభారత్

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో 15వ వార్డులో స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడుగుట్ల అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. 15వ వార్డు పరిధిలోని ప్రధాన రహదారులు, ఇరుపక్కల రోడ్లు, కాలనీల్లోని పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛతే సేవ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని గుడుగుట్ల అనిల్ పిలుపునిచ్చారు.

More articles

Latest article