వీధి కుక్కల స్వైర విహారం…

. . . వాహనాల వెంటపడి పరుగుపెట్టిస్తున్న వీధికుక్కలు

 

. . . గాయాలపాలవుతున్న చిన్నారులు, వాహనదారులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పంచాయతీల్లో,  వార్డులల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిన్నారులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. విద్యార్థులను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో కుక్కలను పట్టి చంపేసేవారు. గత కొంతకాలంగా జంతు సంరక్షణ చట్టం ఆదేశాలతో ఈ చర్యలకు బ్రేక్‌ పడింది. సంతానం వృద్ధి కాకుండా గతంలో శస్త్ర చికిత్సలు చేసేవారు. ప్రస్తుతం అవేమీ చేయకపోవడంతో కుక్కలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. రాత్రి సమయంలో తమ పిల్లలు ట్యూషన్‌కు వెళ్ళి ఇంటికి వచ్చే వరకూ ఆందోళనగా ఉంటోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా సమస్య తీవ్రంగా ఉందని ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడే స్పందించే అధికారులు తరువాత పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

 

Stray dogs roaming freely…896
Stray dogs roaming freely...
Comments (0)
Add Comment