ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

బతుకమ్మ, జుక్కల్ :  జుక్కల్ మండలంలోని కేమ్ రాజ్ కల్లాలి గ్రామంలో మంగళవారం ఆరుగురు పేకాటరాయలను అరెస్టు చేసినట్లు జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. గ్రామంలోని చెరువు కట్ట మీద గంగమ్మ తల్లి గుడి దగ్గర పేకాట రాయలు ఆడుతున్నట్లు సమాచారం తో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వారి దగ్గర వేయి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన రెండు సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా పేకాట ఆడితే వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకొని హెచ్చరించారు.

Six poker players arrested
Comments (0)
Add Comment