కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

బతుకమ్మ: నాగిరెడ్డిపేట : శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మండలంలోని గోపాల్ పేట్, తాండూర్, మాటూర్ గ్రామాలలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వేళలోనే మండల కేంద్రం గోపాల్ పేట్, తాండూర్ గ్రామ ప్రధాన వీధులలో శ్రీ సీతా రామలక్ష్మణ, ఆంజనేయ ఉత్సవమూర్తులను మహిళా, పురుష భక్తులు మంగళ హారతులతో, శ్రీరామ నామ నినాదాలతో పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు ఉత్సవ మూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రామాలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sita and Rama's wedding is a feast for the eyes
Comments (0)
Add Comment