27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సమస్యల వలయంలో సిద్దాపూర్

Must read

📰 Generate e-Paper Clip

Siddapur in trouble

– గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం

– గత రెండు నెలల నుంచి విధులకు రాని పంచాయతీ సెక్రెటరీ

– కన్నెత్తి చూడని అధికారి

రుద్రూర్, బతుకమ్మ: ఎక్కడా చూసిన అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండలంలోని సిద్దాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ గత రెండు నెలలుగా విధులకు రావడం లేదని, గ్రామంలోని ఏ మురికి కాలువను చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉందంటున్నారు. చెత్తను సేకరించడం లేదని, జీపీ ట్రాక్టర్ నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే వారు లేరన్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు అంటున్నారు. ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సురేశ్ బాబు తమ గ్రామం వైపు అసలు కన్నెత్తి  కూడా చూడడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని  కోరుతున్నారు.

Siddapur in trouble

More articles

Latest article