44 ఏళ్ల వయసులో హాఫ్ మారథాన్ పూర్తి చేసిన ఎస్సై దాస సుధాకర్

 

నిజామాబాద్, బతుకమ్మ:

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో అవంతిక తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌లో నిజామాబాద్ విజిలెన్స్ ,ఏపీ టీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దాస సుధాకర్ హాఫ్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.44 ఏళ్ల వయసులో కూడా అత్యుత్తమ ఫిట్‌నెస్‌ను ప్రదర్శించిన దాస సుధాకర్ హాఫ్ మారథాన్‌ను కేవలం 2 గంటల 19 నిమిషాల 23 సెకన్లలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏపీ టీఎస్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శంకర్‌రావు, సిబ్బంది దాస సుధాకర్‌ను అభినందిస్తూ, విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

SI Dasa Sudhakar completes half marathon at the age of 44
Comments (0)
Add Comment