26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దాంపత్య జీవనానికి శివపార్వతులె ఆదర్శం

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దాంపత్య జీవనానికి శివపార్వతులె ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూర్ భక్త  బృందం  కమిటీ ఆధ్వర్యంలో వినాయక నగర్ బస్వ గార్డెన్లో గత ఏడు రోజులుగా బ్రహ్మ ఫణతుల మేఘరాజ్ శర్మతో  శ్రీ శివ పురాణ ప్రవచనము నిర్వహిస్తున్నారు. సోమవారం చివరి రోజు శివపార్వాతుల కళ్యాణానికి వేల సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ  అంగరంగ వైభోవంగా కల్యాణమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై ప్రత్యేక పూజ,కళ్యాణం, హారతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు హిందూ ధర్మంలో జరిగే పెళ్ళి, కన్యదానం, దాంపత్యం యొక్క గొప్పతనం వల్లే ప్రచాత్య దేశాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆదర్శ దంపతులైన శివపార్వతులు దాంపత్యం జీవనం సాగించే అందరికి ఆదర్శం అన్నారు.  మహాశివుడు పార్వతి దేవిని గౌరవించి అర్థ శరీరభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి సమస్త మానవాళికి స్త్రీగా భార్యను ఎలా గౌరవించలో గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నారు. సనాతన ధర్మ రక్షణకు కంకణ బద్దులై హిందూ జాతిని జాగృతం చేయడంలో ఇందూర్ భక్త బృందం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆగమయ్య గురుస్వామి, చెన్న గంగరత్నం, పార్శి రాజు, ఎంసాని రవి, లభిశెట్టి శ్రీనివాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Shiva Parvati is the ideal of married life

More articles

Latest article