సూపర్ బ్రెయిన్ యోగతో చురుకైనా మేధస్సు

 

. . . అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందే జీవన్ రావు

 

హైదరాబాద్, బతుకమ్మ

 

ప్రతినిత్యం విధిగా సూపర్ బ్రెయిన్ యోగ (గుంజిళ్ళు) చెయ్యడం వల్ల చురుకైనా మేధస్సు లభిస్తుందని అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, ఎల్ హంకలోని బర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్సిడరీ ట్రైనింగ్ సెంటర్ లో సూపర్ బ్రెయిన్ యోగ పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ మేరకు సైనికులతో 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగ గుంజిళ్ళు చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రతినిత్యం చేయడం వలన అభ్యర్థులలో జ్ఞాపక శక్తి, అభ్యసనం, సృజనాత్మకత, జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, సమస్యా పరిష్కారం, శారీరక ధారుడ్యం మొదలైనవి పెంపొంది, సమస్యలు,ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా చేసే విధానాన్ని అభ్యర్థులకు వివరించారు.

 

Sharp intellect with Superbrain Yoga
Comments (0)
Add Comment