సెపక్ తక్రా రాష్ట్ర ఉపాధ్యక్షుని సన్మానించిన జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆదివారం హైదరాబాద్ ఫాతే మైదాన్ లో జరిగిన తెలంగాణ సెపక్ తక్రా రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర ఉపధ్యక్షులు గా ఏక గ్రీవం గా ఎన్నుకోబడ్డ జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షులు గాధరి సంజీవ్ రెడ్డి ని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా ఒలింపిక్ అధ్యక్షులు మాట్లాడుతూ సంజీవ్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎంపికవడం పై హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాలను, క్రీడాకారులను మంచి శిక్షణ ఇచ్చి జిల్లా,రాష్ట్రజట్ల కు ప్రాతినిధ్యం వహించేవిధంగా క్రీడాకారులను తయారు చేయాలని సూచించారు.

Sepak Takra State Vice President Honored District Olympic Presidents
Comments (0)
Add Comment