ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేసిన పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. ఈవిషయమై హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించింది. ఈకేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు నిరాకరించారు. అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.