. . . గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పని ఆలస్యం పై ఎమ్మెల్యే అసహనం
. . . 34వ డివిజన్లో పలు కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని 34 వ డివిజన్ లో గల మిర్చి కాంపౌండ్, మార్వాడి గల్లీ, ఓల్డ్ రమేష్ టాకీస్ రోడ్డు తదితర కాలనీలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నప్పుడు మాత్రమే కాకుండా నిరంతరం డ్రైనేజీ పరిశుభ్రత, మంచినీటి సరఫరా, వీధి దీపాల పనులను పర్యవేక్షించాలని తెలిపారు. అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పలు గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీలు గమనించి, వాటిని అరికట్టాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందినా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
. . . గంజ్ కమాన్ వద్ద కల్వర్టు
గాంధీ గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పూర్తైన నేపథ్యంలో తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచిం చారు. సంబంధిత కాంట్రాక్టర్ కల్వర్టు మాత్రమే నిర్మించి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. కల్వర్టు ఎత్తుగా నిర్మించినందునా రోడ్డుకు సమాంతరంగా చేసి వెళ్ళే బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు. వీలైనంత తొందరగా వాహన రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి రమేష్, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, బీజేపీ నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.