24 C
Hyderabad
Sunday, August 2, 2026

దుకాణం వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Must read

📰 Generate e-Paper Clip

  • బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఘటన
  • బాన్సువాడలో ఘటన.. తప్పిన పెను ప్రమాదం

 

బాన్సువాడ, బతుకమ్మ  :  బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.సంగారెడ్డి నుండి బోధన్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పూల దుకాణం వైపు దూసుకుపోయింది. దుకాణాల వద్ద పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ కు ఫిడ్స్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం బస్సు స్పీడ్ కూడా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు సైతం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డ్రైవర్ కు ఫిడ్స్ రావడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు.బస్సు డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article