24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ను అరికట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరచుగా ర్యాగింగ్ ఘటనలు జరగడం సంబంధిత అధికారుల లోపమని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు.  ఈ సందర్భంగా  నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఆదివారం  నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు.  విద్యార్థుల ఆత్మహత్యలకు,  ర్యాగింగ్ ఘటనలకు మెడికల్ కళాశాల నిలయంగా మారిందన్నారు.  జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని , సంబంధిత అధికారులకు తెలిసినా  చర్యలు చేపట్టకుండా ,బయటకు తెలియనియకుండా అనేక సార్లు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.  జూనియర్ మెడికో విద్యార్థిపై   ర్యాగింగ్ చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని, కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ  సమావేశంలో పీడీఎస్ యూ నిజామాబాద్ జిల్లా నాయకులు మనోజ్,నిఖిల్, నగర నాయకులు సాయికిరణ్, దుర్గాప్రసాద్,గౌతం, సాయి చరణ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article