ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ను అరికట్టాలి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరచుగా ర్యాగింగ్ ఘటనలు జరగడం సంబంధిత అధికారుల లోపమని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు. ఈ సందర్భంగా నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలకు, ర్యాగింగ్ ఘటనలకు మెడికల్ కళాశాల నిలయంగా మారిందన్నారు. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని , సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు చేపట్టకుండా ,బయటకు...