27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీపీని కలిసిన పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని   పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన పది మంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న పీసీ లకు హెచ్ సీ లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన పీసీలను  పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఎ.లింబాద్రి రెంజల్ పీఎస్ నుంచి, కె.చిన్నయ్య కోటగిరి పీఎస్ నుంచి, పి.గణేష్ నిజామాబాద్ రూరల్ పీఎస్ నుంచి, కె.యాదవ్ మాక్లూర్ పీఎస్ నుంచి, ఎ.వరప్రసాద్ కమ్మర్ పల్లి పీఎస్ నుంచి, ఎండీ.ఆరీఫుద్దీన్ నిజామాబాద్ టౌన్ పీఎస్ నుంచి, సీహెచ్ శేఖర్ నిజామాబాద్ పీసీఆర్ నుంచి, డి.శ్రీనివాస్ రావు నవీపేట్ పీఎస్ నుంచి, జి.శ్రీనివాస్ భీంగల్ పీఎస్ నుంచి, రాంచందర్ ఇంటలిజెన్స్ ఓడీ నుంచి జగిత్యాల జిల్లాలకు పదోన్నతిపై వెళ్లారు.

Promoted constables meet CP

More articles

Latest article