పేరుకే ప్రెసిడెన్సియల్ ఉత్తర్వులు

 

. . . అధికారులు ఇష్టా రాజ్యంగా ట్రాన్స్ ఫర్ లు

 

. . . ముగిసిన బదిలీల ప్రక్రియ

 

. . . విధులలో చేరుతున్న ఉద్యోగులు

 

. . . ఆదాయం ఉన్న పోస్టులకే డిప్యూటేషన్ లు షూరు

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఒకటి రెండు ప్రభుత్వ శాఖలు మినహా అన్ని శాఖలలో ట్రాన్స్ ఫర్ లను ముగించారు. కొందరు శుక్రవారం నుంచి విధులలో చేరుతుండగా మరికొందరు ఆదివారం తమకు ట్రాన్స్ ఫర్ అయిన ప్రాంతంలో డ్యూటిలలో చేరనున్నారు. ఈ నెలకు సంబంధించిన వేతనం పాత స్టేషన్ లలో తీసుకోవాల్సి ఉండగా ప్రెసిడెన్సీయల్ ఉత్తర్వుల ప్రకారం బదిలీల షెడ్యుల్ ఆదివారంతో ముగియనుంది. జూన్ 6 వరకు ప్రక్రియ ముగించాలని ఉత్తర్వులలో పేర్కోన్నప్పటికి బదీలి షెడ్యూల్ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా నెలరోజులే. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో, మరో శాఖ మినహా మిగిలిన శాఖలలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో పోస్టులలో బదిలీలు జరిగాయి. ప్రభుత్వం బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిపేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతుంటే అధికారులు మాత్రం తమకు అనుకూలంగానే ట్రాన్స్ ఫర్ లు చేశారని టాక్ ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖలో జరిగిన ట్రాన్స్ ఫర్ లు చర్చకు లేవనేత్తాయి…

విద్యాశాఖలో శనివారం వరకు జరిగిన సీనియర్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ ల బదిలీ ప్రక్రియపై చర్చ జరుగుతుంది. కొందరికి అర్హతలు ఉన్న స్పౌజ్ కేటగిరి ఉన్న బదిలీ చేయలేదని తెలిసింది. గతంలో వారికి పదోన్నత్తుల విషయంలో విద్యాశాఖాధికారులు అన్యాయం చేసినట్లు తెలిసింది. సాధారణంగా బదిలీకి 3 సంవత్సరాలు పైబడిన వారిని 40 శాతం మించకుండా బదిలీ చేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను కాదని తమకు నచ్చినట్టు, సెక్షన్ వారు తయారు చేసిన జాబితా ప్రకారం చేశారని ఒకరిద్దరు తమకు పదోన్నతులలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు బదిలీలలో తమకు అదనంగా పాయింట్ లు ఉన్న ట్రాన్స్ ఫర్ లలో పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు. అధికారులు బదిలీ సమయంలో సీనియార్టి ఆధారంగా జాబితా తయారు చేసి ఇప్పుడు ఖాళీలు లేవని చెప్పడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ట్రిబ్యూనల్ ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది

ఎక్సైజ్ శాఖలో ఉమ్మడి జిల్లాలో జరిగిన బదిలీ వ్యవహరం చర్చకు దారి తీసింది. ప్రధానంగా కానిస్టేబుల్ క్యాడర్ తో సమానంగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను నిజామాబాద్ జిల్లాలో ఒక విధంగా, కామారెడ్డి జిల్లాలో మరో విధంగా బదిలీ చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను జోనల్ క్యాడర్ గా పరిగణలోకి తీసుకుని జరిపిన బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కామారెడ్డి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ లను జోనల్ పోస్టులుగా పరిగణించి రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలోని జిల్లాలకు బదిలీ చేశారు. కానిస్టేబుల్ లకు ప్రభుత్వం బదిలీలలో ఇచ్చిన (స్పౌజ్, హెల్త్ బ్యాక్ గ్రౌండ్) లో ఉన్నవారికి మినహాయింపు ఇవ్వకుండా బదిలీ చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ లను నిజామాబాద్ జిల్లాలోనే పోస్టింగ్ లు ఇవ్వడం గమనార్హం. కేవలం ముగ్గురిని మాత్రమే బదిలీ చేశారు. గత నెల 10న ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ల బదిలీ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కుడా కానిస్టేబుల్ లకు స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ లో బదిలీలలో ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వకపోవడం విశేషం.

ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ట్రాన్స్ ఫర్ ల ప్రకారం విధులలో చేరుతున్న వారు కొందరైతే, మరికొందరు అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ట్రాన్స్ ఫర్ ప్రక్రియలో సుదుర ప్రాంతాలకు బదిలీ అయిన వారు, మంచి ఆదాయం వచ్చే పోస్టులలో ఉన్నవారు తిరిగి అక్కడికే పోస్టింగ్ కోసం పైరవీలు షూరు చేశారు. కనీసం డిప్యూటేస్ వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు సైతం తమ చేతికి మట్టి అంటకుండా వసూళ్లు చేసే వారిని డిప్యూటేషన్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతుంది. డిప్యూటేషన్ లు సైతం కాసులు కురిపిస్తున్నాయి.

Presidential orders in name only
Comments (0)
Add Comment