. . . ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ, బతుకమ్మ :
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాన్సువాడ పట్టణంలోని ప్రధాన మురికి కాలువలు, కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజూ తొలగించే చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మున్సిపల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కురిసిన వర్షాల వల్ల స్టేట్ బ్యాంక్ సమీపంలోని కల్వర్టులో ప్లాస్టిక్ కవర్లు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.దీంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాసుల బాలరాజ్ స్వయంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, చెత్తను తొలగింపుజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు చెత్తను కాలువల్లో, రోడ్ల పక్కన వేయకుండా మున్సిపాలిటీ చెత్త సేకరణ వ్యవస్థకు అందించాలని సూచించారు. దుకాణదారులు తమ దుకాణాల ముందు చెత్త పేరుకుపోకుండా పరిశుభ్రత పాటించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ, కల్వర్టులు, మురికి కాలువల్లో పేరుకుపోయే చెత్తను తొలగించే పనులను ప్రతిరోజూ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ముందస్తు చర్యలు తీసుకుంటే వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. ఆయనతో స్థానిక నాయకులు నార్ల రవీందర్, సాగర్ షిండే, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ నందకిషోర్, సయ్యద్ మన్సూర్ తదితరులు ఉన్నారు.