26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ సిబ్బందికి మైనార్టీ నాయకుల సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండలం లో గణేష్ నిమజ్జనం కార్యక్రమం లు మునుపేన్నడు లేని విధంగా శాంతియుత వాతావరణం లో పూర్తి చేయడం పట్ల ఎల్లారెడ్దిపేట మైనార్టీ శాఖ అధ్యక్షులు డాక్టర్ హైమద్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్దిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ ను,ఎస్. ఐ రాహుల్ రెడ్ది, ఇటీవల ఏ ఎస్ ఐ గా ప్రమోషన్ పొందిన పాషా అనే కానిస్టేబుల్ ను కమిటీ తరపున శాలువలు కప్పి అభినందించారు. గతంలో గణేష్ నిమజ్జనం సందర్బంగా మండలం లో చెదురు మదురు సంఘటనలు జరుగగా ఈ ఏడాది ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా  పక్కడ్బెందీగా నిర్వహించిన పోలీస్ సిబ్బందికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ సిబ్బందికి స్టేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూ ఉత్సవాల సందర్బంగా మైనార్టీ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బందిని అభినందించడం సిరిసిల్ల జిల్లాలో ఇది మొదటి సారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ కో అప్షన్ మెంబర్ చాంద్ పాషా, జాఫర్ షరీఫ్,మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ జహంగీర్,   లాల్ మహమ్మద్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Police personnel honored by minority leaders

More articles

Latest article