ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయానికి కరీంనగర్ ఎంపీ ,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 620 ఫిట్లు గ్రానైట్ ను విరాళంగా అందజేశారు. అలాగే ఆలయంలో నీటి సౌకర్యం కొరకు బోరు కూడా వేయించడం జరిగిందని తెలిపారు.తాము అడగగానే ఆలయానికి బోర్ బావిని త్రవించి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు ఆలయానికి గ్రానైట్ అందించడం పట్ల గ్రామ బూత్ అధ్యక్షులు కిషన్, వినోద్ ,చాట్ల తిరుపతి , కిషోర్ ,సంతోష్ లతో పాటు గ్రామస్థులు ఎంపీ,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
