. . . వేల్పూర్ లో మాజీ మంత్రి గృహ నిర్భంధం
. . . తన నివాసంలో నిరహర దీక్ష ప్రారంభించిన వేముల
వేల్పూర్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిరహర దిక్షకు పోలిసులు అనుమతించలేదు. భీంగల్ లో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, భీంగల్ బస్ డిపో పెండింగ్ పనులు పూర్తి చేయాలని, 12 కోట్ల చెపట్టిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే భీంగల్ లో చేయాల్సిన నిరహర దిక్ష కు అనుమతి లేదని పోలిసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. బి ఆర్ ఎస్ నాయకులను, కార్యకర్తలను భీంగల్ వెల్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.దానితో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లో తన ఇంటి వద్ద నిరహర దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…. తాను ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ప్రజాస్వామ్య బద్ధం గా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసం నిరహర దిక్ష చేపడుతాను అంటే అడ్డుకోవడం దారుణం అన్నారు. తాను మంత్రి గా ఉన్నప్పుడు భీంగల్ లో 70 శాతం పూర్తి అయిన పనులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై పూర్తి కాకుండా ఆగిపోయిన పెండింగ్ పనుల పూర్తి కోసం నిరాహార దీక్ష ను అడ్డుకోవడం దారుణం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరడంతో ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు. నా నిరహర దిక్షభగ్నం చేసేందుకు వేల్పూర్ లో నా నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు, నాయకులను కార్యకర్తలను అడ్డుకున్నారు. నా గొంతు నొక్కే ప్రయత్నం నిరశిస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నేను శాంతియుతంగా నిరహర దిక్ష చేస్తుంటే అడ్డుకున్న ఇంట్లో నైనా, పోలీస్ స్టేషన్ లో ఐనా లేదా అరెస్ట్ చేసి జైల్లో వేసిన నిరహర దిక్ష కొనసాగిస్తాను అన్నారు. అహింస యుతంగా చేస్తున్న నిరహర దిక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్ ని తీసి వేయడం, ప్లెక్సిలు తొలిగించి ప్రభుత్వం దిక్షను అడ్డుకోవడంపై ప్రశ్నిస్తానని తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలుపాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.

