24 C
Hyderabad
Sunday, August 2, 2026

రేవ్‌ పార్టీని భగ్నం చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

కొండాపూర్‌లో ఘటన

హైదరాబాద్, బతుకమ్మ:  నగరంలోని కొండాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈఘటనలో 11 మందిపై కేసు నమోదు కాగా, 9 మందిని అరెస్టు చేయడంతో పాటు 6 కార్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రుమ్,1.91 గ్రాములు చెరాస్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. నిందితులను శేరిలింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. విజయవాడకు చెందిన వాసు, శివం రాయుడు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More articles

Latest article