రేవ్‌ పార్టీని భగ్నం చేసిన పోలీసులు

కొండాపూర్‌లో ఘటన హైదరాబాద్, బతుకమ్మ:  నగరంలోని కొండాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈఘటనలో 11 మందిపై కేసు నమోదు కాగా, 9 మందిని అరెస్టు చేయడంతో పాటు 6 కార్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రుమ్,1.91 గ్రాములు చెరాస్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. నిందితులను శేరిలింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. విజయవాడకు చెందిన వాసు, శివం రాయుడు...