24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పై గాంధారి పోలీసులు పోక్సో కేసు నమోదు  చేశారు. ఈ సంఘటనకు సంబంధించి గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. గాంధారి మండలంలోని  ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు రమేష్ పాఠశాల విద్యార్థినిని అసభ్యకరంగా మాట్లాడుతూ వికృత చేష్టలు చేసేవాడు. పరీక్షల నేపథ్యంలో సబ్జెక్టు డౌట్లు క్లియర్ చేస్తానని విద్యార్థిని ఫోన్ నంబర్ తీసుకుని చాటింగ్ చేశాడు. ఇటీవల విద్యార్థిని తల్లిదండ్రులకు సంబంధిత ఉపాధ్యాయుడు ఫోన్ నుంచి తరుచూ ఫోన్ కాల్స్, మేసెజ్ లు రావడంతో అనుమానంతో విద్యార్థిని నిలదీయగా ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలైంది. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడు  రమేష్ పై పోక్సో కేసు నమోదైంది.

More articles

Latest article