ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పై గాంధారి పోలీసులు పోక్సో కేసు నమోదు  చేశారు. ఈ సంఘటనకు సంబంధించి గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. గాంధారి మండలంలోని  ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు రమేష్ పాఠశాల విద్యార్థినిని అసభ్యకరంగా మాట్లాడుతూ వికృత చేష్టలు చేసేవాడు. పరీక్షల నేపథ్యంలో సబ్జెక్టు డౌట్లు క్లియర్ చేస్తానని విద్యార్థిని ఫోన్ నంబర్ తీసుకుని చాటింగ్ చేశాడు. ఇటీవల విద్యార్థిని తల్లిదండ్రులకు సంబంధిత...