గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగాడానికి ప్రజలు సహకరించాలి

 . . . మల్టి జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:                                                                                                                     

హైద్రాబాద్ తరువాత అంత ప్రతిష్టత్మకంగా జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిజామాబాద్ లో జరగుతుందని దానికి ప్రజలు , గణేష్ మండళ్ల నిర్వహకులు సహకరించాలని మల్టి జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు. అదివారం జిల్లా కేంద్రంలోని ఓకటవ టౌన్ పోలిస్ స్టేషన్ లో నిజామాబాద్ పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్ తో కలిసి ఐజి చంద్రశేఖర్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతు…ఈ నెల 17న జరిగే నిమజ్జనం ప్రశాంతంగా జరుగాలి. జిల్లాలో  జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు పోలిస్ శాఖ పని చేస్తుంది. అందుకు సంబందించిన సిబ్బందిని నియమించడం జరిగింది.  ఇప్పటికే ఎర్పాట్లపై సమీక్షంచి సలహలు సూచనలు చేశాం. ఈ సంవత్సరం సున్నితమైన ప్రాంతాలలో శోభయాత్ర సాగే సమయంలో అధనపు సిబ్బందితో పాటు సిసి కెమోరాలను ఎర్పాటు చేశాం. జిల్లా సిబ్బందితో పాటు 2000 మందితో బందోబస్తు ఎర్పాటు చేశాం. బాసర లో చిన్న విగ్రహలను, పెద్ధ విగ్రహాలను నందిపేట్ ఉమ్మేడ వద్ధ నిమజ్జనం ఎర్పాట్లు  చేయడం జరిగింది. రౌడిషీటర్ లతో పాటు కమ్యూనల్ సస్పెక్ట్ లను గుర్తించడంతో పాటు ఇది వరకు గుర్తించి వారిని బైండోవర్ చేయడం జరిగింది. గణేష్ నిమజ్జనంలో డిజేలకు అనుమతి లేదు. మైక్ సెట్ లకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఉరేగింపు సందర్బంగా నేరాలు జరుగకుండా చైన్ స్నాచింగ్ లతో పాటు ఈవ్ టిజింగ్, జేబు దోంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిర్వహకులు సహకరిస్తే ప్రశాంత వాతవారణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని విదాలుగా పోలిస్ శాఖ సిద్ధంగా ఉందని ఐజి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో… నిజామాబాద్ అడిషనల్ డిసిపి కోటేశ్వర్ రావు, నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎసిపి నారాయణ తదితరులు పాల్గోన్నారు.

People should cooperate to make Ganesh immersion happen peacefully
Comments (0)
Add Comment