29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద యుఎస్పిసి మహా ధర్నా

 

కామారెడ్డి, బతుకమ్మ: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలులైన పిఆర్సి, డిఏలు, సిపిఎస్ రద్దు 317 బాధ్యత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఉపాధ్యాయులకు నగదు రహిత హెల్త్ కార్డుల మంజూరు, 398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషన్నల్ ఇంక్రిమెంట్లు, డీఎస్సీ 2004 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వివిధ రకాల 63 డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయుల సంఘం పోరాట కమిటీ యుఎస్పిసి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద జరుగుతున్న మహా ధర్నాకు కామారెడ్డి నుండి యుఎస్పిసి నాయకులు బయలుదేరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నారు. పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర రాష్ట్రస్థాయి ధర్నా ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు, టిసిపిఎస్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవుల, నరేందర్, వెంకటరెడ్డి, నళిని, ప్రభాకర్, సాయిలు, నారాయణ, శ్రీనివాస్, శ్యామ్, బాలయ్య, బాబురావు, ప్రకాష్, గఫార్, అన్వర్, హరీష్, సునీల్, గోపాల్, దేవిజేయ, రూప్సింగ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article