పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పటేల్ కు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ఇటీవల పిసిసి ప్రధాన కార్యదర్శి గా నియమితులైన సిహెచ్ రాంభూపాల్ పటేల్ కు, సీనియర్ జర్నలిస్టు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య పటేల్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపూర్ రవీందర్, గౌరవాధ్యక్షులు బుస ఆంజనేయులు , కోశాధికారి బాసెట్టి సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు హరిచరణ్ సంఘ నాయకులు పాల జనార్దన్, అర్జున్ శేఖర్,సల్ల సత్యనారాయణ , ఖానాపూర్ గంగాధర్ , శంకర్, రత్నాకర్, నవీన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

PCC General Secretary Rambhupal Patel felicitated
Comments (0)
Add Comment