. భార్యా పిల్లలకు గాయాలు
. జాతీయ రహదారిపై ప్రమాదం
సదాశివనగర్, బతుకమ్మ: బైక్ ను ట్రక్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, అతడి భార్యా పిల్లలకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ వద్ధ జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధిచి వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ కు చెందిన రవి తన భార్య లావణ్య, కొడుకు హర్షత్, కూతురు అన్వికతో కలిసి కామారెడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో సదాశివనగర్ మండల కేంద్రంలో బైక్ ను ట్రక్కు ఢీకొట్టడంతో రవి అక్కడికక్కడే మృతి చెందగా, భార్యాకొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.