హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన జైలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక వ్వక్తిపై హత్యాయత్నం చేసిన షేక్ అహ్మద్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ శుక్రవారం తీర్పు వెలువరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాలు. ఎడపల్లి మండలం నెహ్రు నగర్ గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ 12 అక్టోబర్, 2020 న రామ్ నగర్ గ్రామంలోని కల్లు బట్టీలోకి కల్లు తాగడానికి వెళ్ళాడు.కల్లుబట్టిలో కల్లు అమ్ముతున్న పున్నమల్ల రాజేష్ గౌడ్ ను ఉద్దెరకు కల్లు ఇవ్వమని అడిగాడు. కల్లుబట్టి యజమాని గణేష్ గౌడ్ లేడని నిజామాబాద్ నగరానికి వెళ్లాడని ఉద్దెర ఇవ్వడం తనవల్ల కాదని తెలిపాడు.దీనితో ఆగ్రహించిన షేక్ అహ్మద్ కల్లు సీసాలు ఉద్దెర ఇవ్వడం లేదని కల్లు సీసాతో రాజేష్ గౌడ్ ముఖంపై కొట్టి గాయపరిచాడనే హత్యయత్నం నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు జడ్జి సాయిసుధ తమ తీర్పులో నిర్దారించారు. భారత శిక్షస్కృతి సెక్షన్ 307 (హత్యాయత్నం ) ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా నెల రోజుల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

One gets seven years in rigorous imprisonment in attempt to murder case
Comments (0)
Add Comment