26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాణాలు పోతున్నా స్పందించని అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

 

రుద్రూర్ బతుకమ్మ :

 

రోడ్డు పై అనేక ప్రమాదాలు జరుగుతున్న రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ – వర్ని రోడ్డు విస్తీర్ణ పనులలో భాగంగా మండలంలోని అక్బర్ నగర్ రహదారి ప్రక్కన ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మంగళవారం రాత్రి రుద్రూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రుద్రూర్ నుండి వర్ని వైపుకు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా, అక్బర్ నగర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రక్కన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, మొరం, కంకర కుప్పలు అడ్డుగా వేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు స్పందించడం లేదన్నారు.

Officials who fail to respond despite loss of life

More articles

Latest article