బోధన్ మున్సిపల్ ఉద్యోగులు ఇద్దరికి నోటీసులు జారీ

బోధన్, బతుకమ్మ :

బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగుల మధ్య జరిగిన గొడవ పై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.  బోదన్ బల్ధియా కార్యాలయం ఎదుట పరస్పర వాగ్వాదం చోటుచేసుకొని, ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మున్సిపల్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు గొడవలు పాల్గొన్న ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. కార్యాలయం మర్యాదలు, క్రమశిక్షణను కాపాడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన  హెచ్చరించారు.

Notices issued to two Bodhan municipal employees
Comments (0)
Add Comment