మటన్, చికెన్ సెంటర్లకు నోటీసుల జారీ

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

వర్షాకాలం దృశ్యా భీంగల్ పట్టణంలోని చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు ఇతర మాంసం అమ్మేటటువంటి దుకాణాల యజమానులకు గురువారం స్థానిక మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మటన్, చికెన్ ఇతర మాంసం అమ్మే అమ్మకాందారులు వర్షాకాలంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేస్తూ నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ వర్షాకాలం దృశ్యా మాంసం అమ్మే షాపుల యజమానులు స్వచ్ఛమైన, నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందించాలని, మాంసం పైన ఈగలు ఇతర క్రిమి కీటకాలు వాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పైన ప్రత్యేక జాగ్రత్త వహించాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పట్టణ పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో సహకరించాలని తెలియజేశారు. లేని పక్షంలో తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Notices issued to mutton and chicken centers.
Comments (0)
Add Comment